Movies | Music | Music

Agnyaathavaasi Movie Review

January 10, 2018
Haarika & Hassine Creations
Pawan Kalyan, Keerthi Suresh, Anu Emanuel, Khushbu Sundar, Bomani Irani and Aadhi Pinisetty
NA
Anirudh Ravichander
S Radha Krishna
Trivikram

అంచనాలు చేరని...(‘అజ్ఞాతవాసి’ రివ్యూ)

ఇమేజ్ ఓ స్దాయికు చేరుకున్న పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఏం చేద్దామన్నా, ఏం రాద్దామన్నా,ఎలా చూపెడదామన్నా ఇమేజ్ ఇట్టే అడ్డు...ప...డిపోతుంది. ఇమేజ్ ని మ్యానేజ్ చేస్తూ..హీరో ఫ్యాన్స్ ని ఆనందింప చేస్తూ ,సామాన్య ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేస్తూ కథ అల్లటం కత్తి మీద సామే. ఆ విషయంలో త్రివిక్రమ్ ఆరితేరిపోయారని ఆయన గత చిత్రాలు ప్రూవ్ చేసాయి. అందుకే ఈ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. అయితే ఈ సినిమా కొద్ది రోజుల నుంచి ‘లార్గోవించ్’అనే ప్రెంచ్ సినిమాకు కాపీ అంటూ ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. దాంతో ఆ టోరెంట్ కు డౌన్ లోడ్స్ పెరగటం మాట అటుంచితే...‘అజ్ఞాతవాసి’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా... అని ‘లార్గోవించ్’డైరక్టర్ సైతం ఎదురుచూసే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలో ‘అజ్ఞాతవాసి’ఈ రోజు థియోటర్స్ లోకి వచ్చాడు. త్రివిక్రమ్,పవన్ కాంబో (జల్సా,అత్తారింటికి దారేది) మరోసారి హ్యాట్రిక్ కొట్టిందా లే పవన్ ప్లాఫ్ ( సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు) హ్యాట్రిక్ కొట్టారా... సినిమా ఎలాగుంది... ‘లార్గోవించ్’నుంచి నిజంగానే లేపారా..లేక మీడియా క్రియేట్ చేసిన రూమరా అది వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథేంటి :

విందా (బొమన్ ఇరాని) పెద్ద ఇండస్ట్రలియస్ట్.. మిలియనీర్. ఏబీ గ్రూప్ అధినేత అయిన ఆయన్ని ,ఆయన కుమారుడుని కొందరు దారణంగా చంపేస్తారు. ఆయన కు అభిషిక్త భార్గవ్ (పవన్) మొదటి భార్యకు పుట్టిన కుమారుడు. ప్రతీ విషయంలోనూ ప్లాన్ బి అంటూ ఆల్టర్నేటివ్ ఆలోచించి జాగ్రత్తలు తీసుకునే విందా తన పెద్ద కుమారుడుని తన సామ్రాజ్యానికి దూరంగా ఎవరికీ తెలియకుండా అస్సాంలో పెంచుతూంటాడు. అక్కడే ‘అజ్ఞాతవాసి’ లా పెరుగుతున్న అతన్ని సవితి తల్లి ఇంద్రాణి (కుష్భూ)పిలిపిస్తుంది. అయితే డైరక్ట్ గా వారసుడులా రావద్దని, తన తండ్రిని చంపిన వారిని వెతికెపట్టుకోవటం కోసం ఓ ఉద్యోగస్దుడులా కంపెనీలో జాబ్ కు వచ్చినట్లు రమ్మంటుంది. దాంతో కంపెనీ వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం వచ్చిన మేనేజర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ల్యాణ్‌) లా సీన్ లోకు వస్తాడు. అక్కడ నుంచి మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హారాలు చేసుకుంటేనే.. విందా హ‌త్య‌కు కార‌కులెవ‌ర‌నే దానిపై ఆరా తీస్తుంటాడు. మొదట శర్మ (మురళి శర్మ), వర్మ (రావు రమేష్)పై డౌట్స్ వస్తాయి...అక్కడ నుంచి కథ వేగం పుంజుకుంటుంది... ఇంత‌కు విందాను హ‌త్య చేసిందెవ‌రు? సీతారామ్‌(ఆదిపినిశెట్టి) ఎవ‌రు త‌న‌కి, విందాకు ఉన్న లింకేంటి? సూర్యాకాంతం (అను ఇమ్మాన్యుయిల్, సుకుమారి (కీర్తి సురేష్) లకు ఈ కథలో పాత్రేంటి.. అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

‘లార్గోవించ్’తో లింక్ ఉందా

ఓ పెద్ద ఇండస్ట్రలియస్ట్ గుర్తుతెలియని శత్రువుల చేతిలో హత్య చేయబడతాడు. ఆ తర్వాత ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంలో బ్రతుకుతున్న ఆయన కుమారుడుపై ఎటాక్స్ మొదలవుతాయి. అసలు ఆ ఫలానా పెద్దాయన కుమారుడునని తెలియని అతను ఉలిక్కిపడతాడు. తనను ఓ కేసులో ఇరికించటానికి లేదా...మట్టుపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అర్దం చేసుకుంటాడు. దాంతో కూపీ లాగటం మొదలెడతాడు...ఆ క్రమంలో అతనికి తన తండ్రి గురించి,ఆయన హత్య గురించి తెలుస్తుంది..అక్కడ నుంచి తనను తాను సేవ్ చేసుకోవటం... తండ్రిని చంపిన వారిని కనిపెట్టడం...ఆయన ఆస్దికి,ఆశయాలుకు వారసుడు కావటం అనే లక్ష్యాలు పెట్టుకుని చెలరేగిపోతాడు..ఇదంతా ‘లార్గోవించ్’అనే ఫ్రెంచ్ చిత్రం కథ. ఆ కథకు ...ఈ ‘అజ్ఞాతవాసి’కు పోలిక ఉందా అంటే ఖచ్చితంగా ఉందని... పైన రాసిన ‘అజ్ఞాతవాసి’ కథని మరోసారి చదవితే అర్దమవుతుంది. అయితే దర్శక,రచయిత త్రివిక్రమ్ తనదైన శైలిలో దాన్ని తెలుగీకరణ చేసారు. ఆ క్రమంలో ‘లార్గోవించ్’లో చాలా బాగుంది అనిపించే థ్రిల్లింగ్ నేరేషన్ మిస్సైపోయింది. అయితే సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ ఏరియల్ షాట్స్ దాకా చాలా సార్లు లార్గో వించ్ గుర్తుకు వస్తూనే ఉంటాడు. అంటే ఓ రకంగా ఇది ‘లార్గోవించ్’కు లాంగ్ లాంగ్ చుట్టం..అంతే.

త్రివిక్రమ్ తేల్చాసారు

ఇంత సింపుల్ స్టోరీ లైన్ ను ...భారీ ఎత్తున స్టార్ తో తెరకెక్కించాలంటే స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్తారింటికి దారేదిలో ఆ తరహా మ్యాజిక్ చేసి గెలిచాడు. అయితే ‘అజ్ఞాతవాసి’ విషయానికి వచ్చేసరికి హడావిడిపడిపోయాడనిపిస్తుంది. లార్గో వించ్ ని యాజటీజ్ చేస్తే ఆడదు..అలాగని మారిస్తే ...ఇదిగో ఇలా రొటీన్ పాత కథలా మారిపోతుంది. ఈ విషయం త్రివిక్రమ్ కు తెలియదు అంటే నమ్మలేం. ముఖ్యంగా కాంప్లికేటెడ్ గా ఉండే స్క్రీన్ ప్లే తో నడిచే లార్గో వించ్ ని మనకు అనుగుణంగా మార్చాలంటే చాలా సింపుల్ గా నేరేట్ చేయాలి. లేకపోతే చాలా కన్ఫూజ్ అయిపోతుంది. అదే చేయబోయారు త్రివిక్రమ్ . కానీ వంటకం కుదరలేదంతే.

ట్రేడ్ మార్క్ లేదు కానీ..

సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఫన్ కూడిన పొట్టి ప్రాస మాటలు, అక్కడక్కడా డెప్త్ చూపించే గంభీరమైన డైలాగులు ఎక్సపెక్ట్ చేస్తాం. అలాగే కామెడీ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని ఆశిస్తాం. ఆయన గత సినిమాలన్నిటిలోనూ అదే ప్లస్ అయ్యింది. అత్తారింటికి దారేది చిత్రంలో ..స్వామి నదికిపోలేదా అంటూ వచ్చే ఎపిసోడ్ ని ఎవరూ మర్చిపోరు. అలాంటి ఎలిమెంట్స్ ఏమీ ఈ సినిమాలో పెద్దగా లేవు. సెకండాఫ్ లో వచ్చే కొద్ది కామెడీనే కొద్ది రిలీఫ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ ...మిస్సైంది. అయితే ఈ సారి ఆయనలో రైటర్ కన్నా డైరక్టర్ బాగా తెరపై కనిపించటం విశేషం.

ప్రధాన లోపం...

కాటమరాయుడు ఏదైతే సమస్య వచ్చిందో..సర్దార్ గబ్బర్ సింగ్ ఏ ఇబ్బంది వచ్చిందో ఈ సినిమాకూ అదే సమస్య వచ్చింది. విలన్ పాత్రే సినిమాకు విలన్ గా మారింది. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలో సాదాసాదా విలన్స్ ఎలా సరిపోతారు. పోనీ ఇది ఫ్యామిలీ సినిమా కాదు..అత్తారింటికి దారేది సినిమాలో లాగ కామెడీతో లాగేద్దామంటే...రివేంజ్ రచ్చ ప్లాట్ . సినిమాలో విలన్ పాత్ర ఇంకాస్త మెరుగుగా తీర్చిదిద్ది ఉంటే ఈ సినిమా వేరే విధంగా ఉండేది. విలన్ పాత్ర స్ట్రాంగ్ గా లేకుండా తేలిపోవటంతో సినిమా కు సినిమా కనిపించింది. దాంతో సరైన విలన్ లేక హీరో పాత్ర ....ప్లాట్ గా మారిపోయింది.

పవన్ సేవ్ చేసాడు

ఇలాంటి స్క్రిప్టుని సైతం ..పవన్ తన ఛరిష్మా, తిరుగులేని స్క్రీన్ ప్రెజన్స్ తో పూర్తిగా భుజాన మోయటంతో వన్ మేన్ షోగా మారిపోయింది. ఆయన ఎప్పటిలాగే తన జోష్ తో ,ఫుల్ ఎనర్జీతో తెరని వెలిగించే ప్రయత్నం చేసారు. అయితే ఆయన మేనరిజమ్స్ మాత్రం రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ప్రతీ చిన్న మూవ్ మెంట్ సైతం ముందే తెలిసిపోతోంది. ఆయన పాత హిట్ సినిమాల్లో పండిన సీన్స్ మళ్ళీ చూసినట్లు కొన్ని సార్లు అనపించింది. అఫ్ కోర్స్ అది బాగుంది కూడాను.

కీర్తి సురేష్,అను ఇమ్యాన్యుయిల్,మిగతావాళ్లు...

వాస్తవం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో వీళ్లిద్దరికి అంత సీన్ లేదు. కేవలం హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ అంతే. స్టైలిష్ గా గ్లామర్ గా చక్కగా ఉన్నారు. రావు రమేష్,మురళిశర్మ కామెడీ బాగుంది. ఆది క్యారక్టర్ కు అంత ప్రయారిటి ఇవ్వలేదు.దాంతో అతను చెయ్యటానికి ఏమీ లేదు. ఖుష్బూ ,బొమన్ ఇరాని..ఆ పాత్రలకు జీవం పోసారు. రఘుబాబు, వెన్నెల కిషోర్ ఓకే.

మ్యూజిక్ మిగతా డిపార్టమెంట్?

సంగీత దర్శకుడిగా తెలుగులో అనిరుధ్‌ తొలి సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’కు చక్కని పాటలను అందించారు. . బయటకొచ్చి చూస్తే, గాలివాలుగా, స్వాగతం కృష్ణా సాంగ్ ఆకట్టుకున్నాయి. అయితే రిపీట్ ,పోలిక అనుకోకపోతే పవన్ గత హిట్ చిత్రాల పాటలు స్దాయిలో అయితే హిట్ కాలేదు. నేపథ్య సంగీతం పర్వాలేదు. అక్కడక్కడా బాగుంది. వి.మణికందన్‌ కెమెరా పనితనం బాగుంది. డైలాగ్స్ లో 'విచ్చలవిడిగా నరికేస్తే హింస... విచక్షణతో నరికేస్తే ధర్మం’ వంటివి అక్కడక్కడా మెరిసాయి. ఇక కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. అలాగే పవన్‌-త్రివిక్రమ్‌ హిట్‌ కాంబినేషన్‌ కావడంతో నిర్మాత ఎక్కడా రాజీపడకపోవటం గమనించవచ్చు. ప్రతీ ఫ్రేమ్ లోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. త్రివిక్రం దర్శకత్వ స్టాండర్డ్స్ ను ఈ సినిమా మరో లెవల్ కు తీసుకెళ్లింది.

హైలెట్స్

పవన్‌కల్యాణ్‌ను ఇంట్రడక్షన్ సీన్ దుమ్మురేపారు. అలాగే యాక్షన్స్‌ సన్నివేశాలను ముఖ్యంగా బల్గేరియాలో ఛేజింగ్‌ సీన్స్ కూడా అదరకొట్టారు. చిత్రీకరించిన విధానం బాగుంది. త్రివిక్రమ్ పాత రోజుల నాటి ఫన్ ని మనం శర్మ-వర్మ డైలాగుల్లో చూడచ్చు. అలాగే కెమెరా వర్క్ ఇంటర్నేషనల్ స్దాయిలో ఉంది. ఇంటర్వెల్ లీడ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి.

ఫైనల్ ధాట్

త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ సినిమా అని ఎంతో ఎక్సపెక్ట్ చేసి వెళ్ళిన వాళ్లకు ఆ స్దాయి కనపడదు..కానీ కూల్ గా ఏ విధమైన అంచనాలు లేకుండా వెళ్ళిన వారికి సినిమా బాగుందనిపిస్తుంది. అయితే ఇలాంటి సినిమాలకు ఎక్సపెక్టేషన్స్ లేకుండా వెళ్లాలంటే సాధ్యమయ్యే పనేనా...