Movies | Music | Music

Krishnarjuna Yudham Movie Review

April 12, 2018
Shine Screens
Nani, Anupama Parameswaran and Rukshar Mir
Merlapaka Gandhi
Venkat Boyanapalli
Karthik Ghatmananini
Hip Hop Tamizha
Saahu Garapati and Harish Peddi
Merlapaka Gandhi

'టేకిన్' తో సిద్దం (‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ రివ్యూ)

ఇద్దరు కవలలు..వాళ్లు చిన్నప్పుడే విడిపోతారు. ఒకరు మాస్ ఏరియాలో పెరిగితే..మరొకరు మహారాజులా క్లాస్ ఏరియాలో ఎదుగుతారు. ఇద్దరూ తలో గర్ల్ ఫ్రెండ్ ని,తలో విలన్ ని సెట్ చేసుకుని ఆరు పాటులు, నాలుగు ఫైట్స్ అన్నట్లు కాలక్షేపం చేస్తూంటారు. అయితే ఓ సుముహార్తాన..ఇద్దరూ కలుస్తారు..ఒకరినొకరు చూసుకుని మొదట షాక్ అవుతారు..ఆ తర్వాత ఎడ్వాంటేజ్ తీసుకుని ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్తారు. చివరకు ఒకే రూపం ఉన్న తమకు ఉమ్మడిగా ఒక పెద్ద విలన్ ఉన్నాడని...అది తమ తండ్రి నుంచి వచ్చిన వారసత్వ సంపద అని తెలుసుకుని ...వాడి మీద యుద్దం ప్రకటిస్తారు. ఇది ద్విపాత్రాభినయం సినిమాల పెద బాలశిక్ష. ఈ స్క్రీన్ ప్లే రక్షగా మారి..తరతరాలుగా డ్యూయిల్ రోల్ సినిమాలను సిల్వర్ జూబ్లి చేయిస్తూ వస్తోంది. అయితే కాలంతో పాటు మార్పులు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ ద్విపాత్రాభినయం చిత్రాల్లో ఏ తరహా మార్పు వచ్చింది. నాని చేసిన ఈ చిత్రం..పాత స్క్రీన్ ప్లేనే ఫాలో అయ్యిందా..కొత్త కథను ఎంచుకుందా... అసలు సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ ఏంటంటే..

చిత్తూరు జిల్లాలో ఓ పల్లెలో ఉండే కృష్ణ‌(నాని), .యూరప్ లో రాక్ స్టార్ గా ఎదిగిన అర్జున్‌(నాని)వి..ఇద్దరిది ఒకే పోలిక. కానీ కవలలు కాదు..రక్త సంభందీకులు కాదు.. ఇద్దరికీ పరిచయమే లేదు. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉన్నా..ఎవరి పాటలు, ఫైట్ లు వారివే. కృష్ణ క్యారక్టర్ కనపడ్డ ప్రతీ ఒక్క అమ్మాయికీ ప్రపోజ్ చేస్తూంటుంది.కానీ ఒక్కరూ పడరు. ఇక అర్జున్ క్యారక్టర్ కనపడ్డ ప్రతీ అమ్మాయిని అనుభవించాలని అనుకుంటుంది.సక్సెస్ అవుతూంటుంది. ఇలా ఎవరి వృత్తి వ్యాపకాల్లో వాళ్లు బిజీగా ఉన్నప్పుడు ఇద్దరికి లైఫ్ టర్న్ అయ్యే సమయం వచ్చి..కృష్ణ తో రియా(రుక్సార్‌) ప్రేమలో పడుతుంది. అలాగే అర్జున్ తో.. సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ‌) ప్రేమలో పడుతుంది. ఇద్దరూ తమ ప్రేమను ముందుకు తీసుకెళ్ళాలనుకున్న సమయంలో ...కృష్ణార్జునలిద్దిరికి ఒకే సమస్య ఎదురౌతుంది. ఇద్దరి లవర్స్ ని అమ్మాయిలని ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేసే ఇంటర్నేషనల్ ముఠా ఎత్తుకుపోతుంది. అక్కడ నుంచి కృష్ణార్జునలు ఇద్దరూ కురుక్షేత్రంలోకి దూకుతారు. పరిచయమే లేని వీళ్లిద్దరూ ఎలా కలుస్తారు..తమ లవర్స్ ని ...అంతర్జాతీయ ముఠా కబంధ హస్తాల నుంచి ఎలా సేవ్ చేసుకుంటారు అనే విషయాలపై క్లారిటి రావాలంటే సినిమా చూడాల్సిందే.

కారణం లేని కాలక్షేపం

హాలీవుడ్ చిత్రం Taken (2008) ని బేస్ చేసుకుని రాసుకున్నట్లున్న ఈ చిత్రం కథ..ఫస్టాఫ్ ఫన్ తోనూ, సెకండాప్ యాక్షన్ తోనూ నడిపారు. టోటల్ గా ఎక్కడా కథ అనేది కించిత్తు కూడా లేకుండా కేవలం సీన్స్ తోనే లాగేసారు. సెకండాఫ్ లో టేకిన్ టైప్ సస్పెన్స్ యాక్షన్ ఎపిసోడ్ రాసుకున్నప్పుడు ఫస్టాఫ్ లో కూడా అలాంటి స్క్రీన్ ప్లేతోనే కథ నడపాలి అని ఎందుకునో ఆలోచించినట్లు లేరు. దాంతో ఫస్టాఫ్..ఒకరకంగా..సెకండాఫ్ మరో రకంగానూ..టోటల్ గా సినిమా చూసాక రకరకాలుగానూ అనిపించింది.

అలాగే నాని సినిమా, దానికి తోడు ద్విపాత్రాభినయం అనగానే....ఫన్ ప్రవాహంలా పారుతుందని ఆశిస్తాం. అయితే దర్శకుడు ప్రేక్షకుల ఊహకు అందకూడదు అని ఫిక్స్ అయ్యి తీసినట్లున్నారు. ఎక్కడా ఎవరికీ అందని సినిమా చేసారు.

ఈ సినిమా అంతా చూసాక ఓ పెద్ద డౌట్ మన ముందు చేతులు కట్టుకుని నిలబడుతుంది. అదేమిటంటే.... అసలు ఈ సినిమాకు హీరో చేత ద్విపాత్రాభినయం ఎందుకు చేయించినట్లు అని. అందుకు మనకు ఒకటే అనిపిస్తుంది... డైరక్టర్ గారు... ఇద్దరు హీరోల కోసం కథ రాసుకుని..ఆ కాంబినేషన్ సెట్ కాకో, లేక బడ్జెట్ వర్కవుట్ కాకో ఒకే హీరోతో డ్యూయిల్ రోల్ లాగించేసినట్లుంది.

చాలా మంది కృష్ణార్జున యుద్దం అనగానే ..కృష్ణుడు పాత్రకి, అర్జునుడు పాత్రకి మధ్య బేధాభిప్రాయాలో..అభిప్రాయ బేధాలో వచ్చి యుద్దం చేసుకుంటారు అని ఆశిస్తారు. నిజానికి అలా ఉంటే కాస్తంత కాంప్లిక్స్ పాయింట్ రైజ్ అయ్యేది. కానీ అలా కాకుండా ఇందులో కృష్ణుడు, అర్జునుడుకి ఇద్దరికి ఒకే సమస్య వచ్చి..ఇద్దరూ ఒకటయ్య..సమస్యపై పోరాడతారు. ఇలాంటి పాయింట్ తీసుకున్నప్పుడు విలన్ ని స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయాలి. అదీ చేయలేదు. విలన్ చివరి నిముషంలో హీరో లు ఇద్దరి చేతిలో చచ్చేదాకా పెద్దగా హైలెట్ కాడు...అయినా సినిమా అంతా హీరో ద్విపాత్రాభినయానికే సరిపోయింది. విలన్ కు పాపం సీన్స్ పెట్టేంత ఖాళీ స్క్రీన్ ప్లేలో లేకుండాపోయింది.

హీరోలు ఇద్దరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని విలన్ కు తెలిసినట్లు లేదు.. దాంతో ఈ హీరోలకు ఎదురయ్యే కష్టాలు, వాళ్లకు అడ్డుపడే విలన్ మనుషులు చాలా బలహీనంగా ఏర్పాటు చేసాడు. దాంతో చాలా సన్నివేశాలు పేలవంగా తేలిపోయాయి. ఇక క్లైమాక్స్ కూడ బాగా రొటీన్ గా...షిప్ యార్డ్ తో విలన్ తో ఫైట్ తో ఆ పాత కాలం రోజుల సినిమాలను గుర్తు చేస్తూ సాగింది.

టెక్నికల్ గా చెప్పాలంటే..

కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్స్ లో ఒకటి. కృష్ణ పాత్ర కోసం గ్రామంలో షూట్ చేసిన ప్రతి సీన్ బాగుంది. సంగీత దర్శకుడు హిపాప్ తమిజా పాటలు ఓకే అనిపించుకున్నా... మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించారు. ఎడిటింగ్ బాగానే ఉంది కానీ సెకండాఫ్ ను కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.కానీ ట్రిమ్ చేస్తే ఇప్పటికే సెకండాఫ్ లెంగ్త్ తక్కువగా ఉంది..అది ఏ ఇరవై నిముషాలకో అరగంటకో పడిపోతుంది అని భయపడి ఉంటారు. నిర్మాతలు కథను ఎంచుకోవటంలో దారి తప్పేరేమో కానీ నిర్మాణ విలువల విషయంలో కాంప్రమైజ్ కాలేదు.

నటుల్లో ఎప్పటిలాగే నాని బాగా చేసాడు...చిత్తూరు యాసతో కొత్తగా , తమిళ సినిమాల్లో హీరోలాగ ఉన్నాడు. అనుపమ పరమేశ్వరన్ సోసో..బ్రహ్మాజీ,ప్రభాస్ శీను తన కామెడీతో బాగానే లాగాడు. నాని స్నేహితుడుగా చేసిన కుర్రాడు కూడా తన యాసతో మంచి ఈజ్ తో బాగా చేసాడు.

ఫైనల్ థాట్

సరైన కారణం లేని యుద్దం...సరైన ఫలితం కూడా ఇవ్వదు

ADVERTISEMENT
ADVERTISEMENT